- Advertisement -
- – ఒకరు గల్లంతు… పశువులతో ఒడ్డున ఉన్న ఐదుగురు రైతులు
– తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీ లను కోరిన కేకే మహేందర్ రెడ్డి
– సంఘటన స్థలానికి వెళ్లిన కలెక్టర్, ఎస్పీ ,ప్రత్యేక బృందాలు
నవ తెలంగాణ రాజన్న సిరిసిల్ల
భారీ వర్షాలకు ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది.. పశువులను మేపడానికి ఆరుగురు వ్యక్తులు పశువులతో సహా బుధవారం ఉదయం అవతలి వైపు వెళ్లారు. గంట వ్యవధిలోనే మానేరు వాగు ఉప్పొంగడంతో తిరిగి రాలేని పరిస్థితిలో వారు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిలో మానేరు క్యాంపు కు చెందిన జెల్ల నాగం అనే వ్యక్తి ఎగువ మానేరు ప్రాజెక్టు సమీపంలో గల్లంతయినట్లు సమాచారం. మానేరు క్యాంపు కు చెందిన పంపుకాడి నాగం తో పాటు నర్మాలకు చెందిన పిట్ల మహేష్ పిట్ల స్వామి అన్నం స్వామి పిట్ల నరసింహులు ధ్యాన బోయిన స్వామి లు అవతలి వైపు గడ్డపై పశువులతో సహా ఉన్నామని నవ తెలంగాణతో బాధితుడు పిట్ల మహేష్ ఫోన్ ద్వారా వివరించారు. - తక్షణమే స్పందించిన కేకే మహేందర్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కి విషయం తెలీయగానే తక్షణమే ఆయన స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు వెంటనే ఈ విషయం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జ ఎస్పి మహేష్ బిగితే లకు వివరించాడు. వారు స్పందించి సంఘటన స్థలానికి తరలి వెళ్లారు అంతేకాకుండా రక్షణ చర్యలు చేపట్టడానికి రక్షణ బృందాలను తీసుకువెళ్లారు. కేకే మహేందర్ రెడ్డి ప్రమాదంలో చిక్కుకున్న వారితో మాట్లాడి సహాయక బృందాల ద్వారా ఒడ్డున ఉన్న ఐదుగురిని క్షేమంగా తీసుకువస్తామని గల్లంతైన వ్యక్తి కోసం గాలించడం జరుగుతుందని మహేందర్ రెడ్డి ఒడ్డున్న ఉన్న వారికి మనోధైర్యం కల్పించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా వారిని రక్షించడానికి చర్యలు చేపట్టడం జరిగిందని మహేందర్ రెడ్డి వివరించారు.
- Advertisement -