నవతెలంగాణ – జుక్కల్
నియోజకవర్గ ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గం వ్యాప్తంగా 8 మండలాలలో వినాయక చవితి, నవరాత్రోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నిర్వాహకులు మండపాలు ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలను తరలిస్తున్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులు అనే తేడా లేకుండా అంతా ఐకమత్యంతో పండుగను జరుపుకుంటున్నారు. ఇక ప్రధాన ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టారు. తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు తెల్లవారుజామునే కోవెలకు చేరుకుని.. తన కోరికలు తీర్చాలంటూ ఆ భవగవంతుడి ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని కోరుతూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుడి ఆశీస్సులతో మీ ప్రతి పనిలో విజయం సిద్ధించాలని అన్నారు. విఘ్నాధిపతి మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే షిండే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES