Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పూజా సామాగ్రి అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే

పూజా సామాగ్రి అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజా సామాగ్రిని నిర్వాహకులకు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లోని రాయపర్తి మండలానికి చెందిన శివాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టిపిసిసి మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి వినాయక మండపాలకు అందిస్తున్న నవరాత్రి ఉత్సవాల పూజ సామాగ్రి బ్యాగులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.

శివాని చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాయపర్తి మండలంలోని 3 వినాయక మండపాలకు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సరిపడా పూజా సామాగ్రిని అందిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా శివాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ల సహకారంతో సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad