ఆమె సేవ స్ఫూర్తి.. తత్పరత అపూర్వం, అమోఘం
నవతెలంగాణ – పెద్దవూర
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల దామెర విద్యార్థులకు సామాజిక కార్యకర్త, ప్రభుత్వ ఉపాధ్యాయులు గురిజ మహేష్ ఆధ్వర్యంలోసామాజిక కార్యకర్త శ్రావణి గుప్త పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు అభ్యసన సామాగ్రి , కేక్పంపిణి చేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త, ప్రభుత్వ ఉపాధ్యాయులు గురిజ మహేష్ మాట్లాడుతూ.. పుట్టినరోజు వంటి వేడుకల సందర్భంగా డబ్బులు విలాసాలకు ఖర్చు చేయకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే అభ్యసన సామాగ్రి అందజేయడం సామాజిక కార్యకర్త శ్రావణి గుప్తా గొప్ప సేవా దృక్పథానికి నిదర్శనమని, ఆమె స్ఫూర్తి తత్పత అపూర్వం అని ఆమె అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా రాజశేఖరం, ఉపాధ్యాయులు యాదయ్య, ఇమామ్, వెంకటరమణ,మహేష్, ఉజ్వల,శ్రవణ్, శిరీష, రవి, సాజిదా బేగం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మానవతా మూర్తి శ్రావణి గుప్త..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES