– ప్రాజెక్ట్ అధికారులు..
నవతెలంగాణ – జుక్కల్
కౌలాస్ నాలా ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతంలో నిరంతర వర్షాలు కురుస్తున్నందున రాబోయే గంటల్లో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. కావున ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని వదిలే అవకాశం ఉన్నది. కావున రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా, గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా కౌలస్నాల ప్రాజెక్ట్ గెట్ల క్రిందా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండగలరని మనవి.
నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు , రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలెనని కోరుతున్నాము. కౌలాస్ నాలా ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్, రెవెన్యూ అధికారులకు, ప్రజప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాము.