- Advertisement -
నవతెలంగాణ తాంసి: బుదవారం కురిసిన భారీ వర్షాలతో తాంసి మండలంలోని వడ్డాడి మత్తడి ప్రాజెక్టులోకి ఎగువ నుండీ భారీ నీటి ప్రవాహంతో నీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 277.20 చేరుకుంది. ఎగువ నుండి భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు ఇన్ఫ్లో 1100 .0 క్యూసెస్ చేరగా.3032. 0 క్యూసేస్ నీటిని దిగువకు నీటిని వదిలినట్లు ప్రాజెక్ట్ జేఈ హరీష్ తెలిపారు. ఇంకా భారీ వర్షాలు కురిసినట్లయితే మరో మూడు గేట్లు కూడా ఎత్తివేసే అవకాశం ఉందని ప్రాజెక్టు దిగివక ఉన్న గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
- Advertisement -