నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. గురువారం తెల్లవారుజామున గురేజ్ సెక్టార్ నుండి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ నౌషేరా నార్ ఫోర్ పేరుతో ఇండియన్ ఆర్మీ మరియు జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. చొరబాటు ప్రయత్నం గురించి సమాచారం అందిన వెంటనే గురేజ్ సెక్టార్‌లో పోలీసులు, సైనికులు మోహరించగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరడంతో పోలీసులు, సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొని ఇద్దరిని మట్టుపెట్టినట్టు సమాచారం.
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES