- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు సామర్థ్యాన్ని మించి పొంగిపొర్లడంతో పోచారం దిగువ ప్రాంతమైన చినుర్, వాడి గ్రామస్తులను తాసిల్దార్ శ్రీనివాసరావు ఆదేశానుసారం రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులను బుధవారం రోజు రాత్రి మండల కేంద్రంలో పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సత్రంలోకి తరలించారు. సత్రంలో ఉన్న చినూరు గ్రామస్తులకు గురువారం రోజు రెవెన్యూ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శేఖర్, సుధాకర్, నారాయణ రెడ్డి, కిష్టయ్య, మహేష్, పర్వతరావు, మురళి గౌడ్, గంపల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -