- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాగిరెడ్డిపెట మండల వ్యాప్తంగా 4442 ఎకరాలలో వరి పంట నీట మునిగినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ అంచనా వేయడం జరిగింది. నీరు తగ్గిన తర్వాత నాగిరెడ్డిపేట మండల వ్యాప్తంగా ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగిందో సర్వే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మండల వ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -