- Advertisement -
- – బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
నవతెలంగాణ -పరకాల
పరకాల కోర్టు అదనపు న్యాయమూర్తిగా శ్రీవల్లి శైలజ గురువారం బాధ్యతలు చేపట్టారు. పరకాల, నడికూడ, దామెర మండలాలతో కలిపి గత నాలుగు సంవత్సరాల క్రితం అదనపు కోర్టు ఏర్పడడం జరిగింది. అప్పటినుండి అదనపు న్యాయమూర్తి నియామకం కాలేదు ఈ క్రమంలో గురువారం అదనపు న్యాయమూర్తిగా శైలజ బాధ్యతలు స్వీకరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారిని ప్రధాన న్యాయమూర్తి సాయి శరత్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల భద్రయ్య ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి, ఒంటేరు రాజమౌళి, ఏ జి పి మెరుగు శ్రీనివాస్, బార్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు కూకట్ల శ్రీనివాస్, చంద్రమౌళి, పరమేశ్వర్, సాబీర్, రాహుల్, విక్రమ్, చంద్రమోహన్, రాజు, సురేష్, రమేష్, రవికుమార్, లక్కం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -