నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.