Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కూలీలకు ఉపాది కల్పించాలి..!

నిరుపేద కూలీలకు ఉపాది కల్పించాలి..!

- Advertisement -

– ఈజిఎస్ సిబ్బంది పద్ధతి మార్చుకోవాలి
– ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

నీరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టడానికి అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం,మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో నిరుపేద కూలీలకు ఉపాది కల్పించాలని జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ ఈజిఎస్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత ఉపాదిహామీ సామాజిక ప్రజావేధికకు హాజరై  ఆయన మాట్లాడారు గ్రామాల్లో ఉపాధిహామీ పిల్డ్ అసిస్టెంట్లు చెసిన తప్పిదాలకు నిజమైన కూలీలకు నష్టం జరుగుతుందన్నారు.

పనులపై పర్యవేక్షణ చేయాల్సిన సంబంధించిన మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో పిల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.కూలి పనులు చేసుకునే వారికి జాబ్ కార్డులు ఇవ్వడంలో పిల్డ్ అసిస్టెంట్లు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టుగా ఆరోపణలు తన దృష్టికి వచ్చిందన్నారు. కూలి పనులకు ఒక్కరికి బదులు మరొక్కరు, పనులకు వేళ్ళని, ఇంటివద్ద ఉన్నవారి పేర్లను, పిల్డ్ అసిస్టెంట్ల కుటుంబ సభ్యుల పేర్లు తదితర ఆరోపణలు వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్డ్ అసిస్టెంట్లు గతంలో కాకుండా ఇప్పటికైనా తమ బుద్దిని మార్చుకోవాలని,లేదంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ బాలకిషన్, డివిఓ రూబినా, డిసి ధరమ్ సింగ్, ఎంపిడిఓ శ్రీనివాస్, ఎపిఓ హరీష్, ఎస్ ఆర్పి వెంకన్న పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad