- – సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ - చిట్యాల నుండి భువనగిరి మీదుగా జగదెపూర్ వరకు ప్రయాణికులు, మీద వెహికల్స్ వెల్లె ప్రధాన జాతీయ రహదారి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి, నందనం గ్రామాల మధ్యన ఉన్న జాతీయ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీ కోరారు. గురువారం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని నందనం టూ నాగిరెడ్డిపల్లి మధ్యన రోడ్డుపై నుంచి నీళ్లు పోతున్న ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం “నిరసన ” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ గత 10 నుంచి 12 సంవత్సరాలుగా నాగిరెడ్డిపల్లి నందనం మధ్యన రోడ్డ నుండి నీళ్లు పోవడానికి ఉన్న బ్రిడ్జి సరిపోకపోవడంతో అనేకసార్లు చిన్న వర్షానికి కూడా వాహనాలు ప్రయాణికులు రోడ్డు దాటడంలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణం మొదలుకొని మండల పరిధిలోని 10 గ్రామాలకు పైగా చెరువులు నుండి అలుగులు గురువారం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో బ్రిడ్జిని వెడల్పు, ఎత్తు లేకపోవడంతో వచ్చిన వరదతో ప్రయాణికుల ప్రాణాలు పోగొట్టుకుంటున్న పాలకులకు పట్టదా..? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే పాలకులు స్పందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇప్పటికైనా నాగిరెడ్డిపల్లి, నందనం గ్రామాల మధ్యన జాతీయ రహదారి పైన నీళ్లు పోవడానికి తక్షణం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. భువనగిరి పట్టణం మొదలుకొని మండల పరిధిలోని 10 గ్రామాలకు పైగా చెరువులు నుండి అలుగులు పోయడంతో ఆ నీళ్లు మొత్తం కూడా ఈ జాతీయ రహదారి పైన చిన్న బ్రిర్జి నుండి నీళ్లు అవతలి భాగం పోవడానికి లోతు వెడల్పు సరిపోక రోడ్డు పైనుండి నీళ్లు వెళ్తున్నాయని, నీళ్ల లోతు ప్రయాణికులకు సరైన అవగాహన లేక నీళ్లు దాడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకులు వర్షాలకు నీళ్లు వచ్చినప్పుడు ప్రజలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేసినప్పుడు కంటి తడుపు చర్యలు తప్ప పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పలుమార్లు సిపిఎం ఆధ్వర్యంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరిన పట్టించుకోవడంలేదని అన్నారు. వివిధ జిల్లాలను రాష్ట్రాలను కలుపుతూ కొనసాగుతున్న ఈ జాతీయ రహదారి చాలా కీలకమైనదని, వందలాది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, వేలాదిమంది ప్రయాణికులు ఈ రోడ్డు వెంబడి నిత్యము రాకపోకలు కొనసాగిస్తారని ఇలాంటి రోడ్డు విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. గత రెండు రోజులుగా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు.
ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి హై లెవెల్ బ్రిడ్జిని తక్షణం నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని జహంగీర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, భువనగిరి మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల నాయకులు వడ్డబోయిన వెంకటేష్, గునుగుంట్ల శ్రీనివాస్, అబ్దుల్లాపురం వెంకటేష్, కొండపురం యాదగిరి, జిట్టా అంజిరెడ్డి, ఎదునూరి వెంకటేష్, సురుపంగా ప్రకాష్, ఆయా గ్రామాలకు సంబంధించిన సిపిఎం సభ్యులు కడారి కృష్ణ, ఎండి. జహంగీర్, కొల్లూరి సిద్దిరాజు, మొగిలిపాక సుధాకర్, గంగదారి గణేష్, బీస్ సతీష్ లు పాల్గొన్నారు.