Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రదర్శన

గ్రామపంచాయతీ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రదర్శన

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
రాయపర్తి మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు చెందిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను గురువారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కిషన్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. అందులో ఏమైనా ఆక్షేపణలు ఉంటే గ్రామపంచాయతీ కార్యాలయంలో లేదా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఈ నెల 30వ తేదీలోపు తెలియజేయాలని విన్నవించారు.  ఒకవేళ తప్పులుంటే వాటిని సరిచేసి తిరిగి రెండవ తేదీ ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్, మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad