- Advertisement -
- – నీట మునిగిన పంట పొలాలు..
– ఆదుకోవాలని వేడుకలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత రెండు రోజులుగా కూర్చున్న వర్షాలకు గాను డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల లో చెరువులు కుంటలు తెగిపోయి నీట మునిగిన పంట పొలాలకు తీరి నష్టం చేకూర్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటు చూసినా రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇందల్ వాయి మండలంలోని గన్నారం, సిర్నపల్లి, బర్దిపూర్ రహదారులపై నుండి నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత ఎన్నో సంవత్సరాల క్రితం ఇలాంటి వర్షాలతో చూసామని వారు పేర్కొంటున్నారు. అధికారులు మాయ మండలాల్లో పూరి గుడిసెలు కూలిపోయే దశలో ఉన్న నివాస గృహాల్లో ఉంటున్న వారిని షెల్టర్ హోమ్ కు తరలించారు. - నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఇందల్వాయి తో పాటు తదితర గ్రామాలను పరిశీలించి ప్రజలకు పరిశోధనలు సలహాలను అందజేశారు. ఇందల్వాయి చెరువు ప్రమాదకరంగా మారడంతో ప్రత్యామ్నాయంగా నీటిని తరలించే విధంగా చూడాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఇలాంటి అపయం జరగకుండా అధికారులు సమన్వయంతో కృషి చసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కూడా ప్రమాదకరంగా ఉన్న చోట వెళ్లవద్దని అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని సూచించారు.
- Advertisement -