నవతెలంగాణ -ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదిన సందర్భంగా గురువారం రోగులకు బిజేపి పార్టీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. స్థానిక కంటి దవాఖానాలో పండ్లు పంపిణీచేశారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు .ఎమ్మెల్యే ముధోల్ అభివృద్ధికి నిరంతరం కృషిచేయటం అభినందనీయం ని అన్నారు .ముధోల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటం లో ఎమ్మెల్యే కృషి మరవలేనిదన్నారు.మరో మూడు సంవత్సరాలో ముధోల్ మరింత అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్,మాజీసర్పంచ్ అనిల్, మాజీ ఉపసర్పంచ్ మోహన్ యాదవ్, రిటైర్డ్ టీచర్ సాయన్న, నాయకులు తాటేవర్ రమేష్, జీవన్, మెత్రి సాయినాథ్, బతినోళ్ల సాయి, తదితరులు పాల్గొన్నారు.
కంటి ఆస్పత్రిలో పండ్ల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES