నవతెలంగాణ – వనపర్తి
నూతనంగా రూపొందించి గ్రామ పంచాయతీలలో గురువారం ప్రదర్శించిన ఓటర్ లిస్టులో ఏవైనా పొరపాట్లు ఉంటే చూసి వెంటనే సరి చేసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. పేరు, ఇంటిపేరు, ఆధార్ నెంబర్, అడ్రస్ వంటి అంశాల్లో ఏమైనా పొరపాట్లున్నా సరి చేసుకోవడానికి స్థానికంగా ఉండే “బూత్ లెవెల్ అధికారి (BLO)” సంప్రదించి సరి చేసుకోవాలని తెలిపారు. అలాగే ఓటు హక్కు కలిగి ఉండి ఓటర్ లిస్టులో పేరు కనబడకపోయినా గ్రామము పేరు తప్పు పడినా, ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యుల పేర్లు వేరే వేరే వార్డులలో నమోదైన సవరించుకోవ డానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంప్రదించగలరు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేవారు మీ సేవలో అప్లై చేసుకొని సంబంధిత మండల తాసిల్దార్ కు అందజేయాలని తెలిపారు. మండలాలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ ఓటర్ లిస్ట్ పై దృష్టి సారించి తప్పు ఒప్పులను వెంటనే సవరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఓటర్ లిస్ట్ సరి చూసుకోండి : ఎమ్మెల్యే మేఘారెడ్డి
- Advertisement -
- Advertisement -



