- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన కళ్యాణి(26) పురిటి నొప్పులతో రాయికల్ ఆస్పత్రికి తరలిస్తున్న సందర్భంలో రామాజీపేట శివారులో ఊహించని ఇబ్బంది తలెత్తింది. బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన రామాజీపేట యువకులు వెంటనే స్పందించారు. జేసిబిని ఏర్పాటుచేసి, గర్భిణీని సురక్షితంగా బ్రిడ్జి దాటేలా సహాయం చేశారు. అప్పటికే అక్కడికి అంబులెన్స్ చేరుకోవడంతో, గర్భిణీని జాగ్రత్తగా అంబులెన్స్ లో ఎక్కించడంతో 108 సిబ్బంది ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అత్యవసర పరిస్థితుల్లో యువత చూపిన చొరవను స్థానికులు అభినందంచారు.
- Advertisement -