Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్అమెజాన్ ఫ్రెష్ వారి లోకల్ డిలైట్స్ స్టోర్­తో భారతదేశపు రుచుల వేడుక చేసుకోండి

అమెజాన్ ఫ్రెష్ వారి లోకల్ డిలైట్స్ స్టోర్­తో భారతదేశపు రుచుల వేడుక చేసుకోండి

- Advertisement -

– ఫిల్టర్ కాఫీ ఇంకా మురుక్కు మొదలుకుని మామిడి ఆవకాయ ఇంకా మక్కీ ఆటా వరకు, స్థానికులు మెచ్చేవి కనుగొనండి
– వీటన్నింటినీ మీ గుమ్మం వద్దకు 2 గంటల్లో డెలివర్ చేర్చటం

బెంగుళూరు: ఓనమ్, వినాయక చవితి మొదలుకుని నవరాత్రులు, దీపావళి వంటి ఉత్తేజకరమైన పండుగలతో కూడిన సీజన్­కు భారతదేశం సంసిద్ధం అవుతున్న తరుణం ఇది – ప్రతి వేడుకలో ఆహారానిదే అగ్రపీఠం. సాంప్రదాయబద్ధమైన రుచులను ఆస్వాదించేందుకు, అలనాటి వంటకాలను మళ్ళీ అందిపుచ్చుకునేందుకు, కుటుంబంతో, మిత్రులతో కలిసి స్థానికంగా అందరూ మెచ్చే వంటకాలను కలిసి ఆస్వాదించే సీజన్ ఇది. అది నోరూరించే స్పైసీగా ఉండే ఆంధ్రా ఊరగాయలు కావచ్చు, కరకరలాడే మురుక్కు కావచ్చు, పంజాబీ లస్సీలో వెచ్చదనం కావచ్చు, లేదా తాజాగా కాచిన కాఫీ కమ్మదనపు సువాసన కావచ్చు, అమెజాన్ ఫ్రెష్ వారి లోకల్ డిలైట్స్ స్టోర్ మీ కోసం తీసుకువస్తోంది ఇంటి వంటల అసలైన రుచుల కమ్మదనాన్ని మీ వంటింటికి చేరుస్తుంది.

భారతదేశపు అమోఘమైన వంటకాల వారసత్వాన్ని వేడుకగా జరుపుకునేందుకు కూర్చిన లోకల్ డిలైట్స్ స్టోర్, పండుగల్లో తప్పకుండా కలిగి ఉండాల్సినవాటిని, స్థానిక ప్రత్యేకతలను, దైనందిన స్టేపుల్సును ఆఫర్ చేస్తోంది. ఇవన్నీ, 170కి పైగా పట్టణాల్లో 2 గంటల్లోపు మీ గుమ్మం వద్దకు గొప్ప ధరలకే డెలివర్ అవుతాయి. అమెజాన్ పేతో కస్టమర్లు అదనపు సేవింగ్స్ కూడా పొంది ఆనందించవచ్చు. కాగా ప్రైమ్ మెంబర్లు డెలివరీని ఇంకా వేగంగా పొందవచ్చు. తద్వారా ఫెస్టివ్ షాపింగ్ మరింత సులభం, మరింత లాభకరం అవుతుంది.

“భారతదేశంలో పండుగలంటేనే రుచికరమైన వంటలు, కుటుంబం, సాంప్రదాయాలు. తాము మెచ్చిన స్థానిక రుచులను కస్టమర్లు పొంది ఆనందించటాన్ని అమెజాన్ ఫ్రెష్­తో మేము మరింత సులభం చేస్తున్నాము,” అని శ్రీకాంత్ శ్రీ రామ్, డైరెక్టర్, అమెజాన్ ఫ్రెష్ ఇండియా అన్నారు. “మా లోకల్ డిలైట్స్ స్టోర్­తో కస్టమర్లకు విస్తృత శ్రేణిలో అసలైన స్థానిక ఉత్పత్తులను సరసమైన ధరలకు, వేగంగా, తమ ఇంటి గుమ్మం వద్దకే సౌకర్యవంతంగా పొందగలుగుతారు. దానితో వేడుకలు ఇంక ఎప్పటికీ ఎదురు చూడవలసిన అవసరం ఉండదు.”

10 అమెజాన్ ఫ్రెష్ వారి లోకల్ డిలైట్స్ స్టోర్ నుండి స్థానిక నిత్యావసరాలు:

1.      టాటా డిగ్రీ కాపీ ఫిల్టర్ కాఫీ  : ఈ అమోఘమైన, అద్భుతమైన ఫిల్టర్ కాఫీతో దక్షిణ భారతదేశపు పండుగ వాతావరణాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. టాటా డిగ్రీ కాపీ ఆఫర్ చేస్తోంది అసలైన తమిళనాడు ఫ్లేవర్. దీనిలో కాఫీ మరియు చికోరీలు, 80:20 నిష్పత్తిలో మిశ్రమమై ఉంటాయి. ఫిల్టర్ అవసరం ఉండదు – డికాక్షన్ నీటిని వేడి పాలతో కలపండి, కలియబెట్టండి, తాగండి! తెల్లవారుఝామున, పూజ చాట్స్ తర్వాత, వర్షం కురుస్తున్న రోజున కుటుంబసభ్యలతో కలిసినప్పుడు ఎంతో అనువైనది.

2.     మురుక్కు: దక్షిణ భారతదేశపు పండుగకాలపు స్టేపుల్. మురుక్కు చక్కగా కరకరలాడుతూ, వంకీల ఆకారంలో, స్పైస్ చేయబడి ఉంటుంది. బహూకరించటానికి, టీ-టైమ్­లో చిరుతిండిగా తినేందుకు, పండుగ కాలం కోసం స్నాక్ జార్­లలో నిలువ చేసుకునేందుకు అనువైనది. ఒక్క ముక్క కొరికితే, మీ చిన్ననాటి దీపావళి రోజులకు చేరుకుంటారు.

3.     సోనా మసూరి బియ్యం : సువాసన కలిగిన, తేలికగా ఉండే, సాంప్రదాయబద్ధమైన ఓనమ్ సంధ్య లేదా పొంగల్ విందుకు అత్యవసరమైనది. ఈ దావత్ సోనా మసూరి రైస్, నిమ్మ-పులిహోర, సాంబార్ రైస్, లేదా అందరూ ఇష్టపడే విధంగా అరటి ఆకుల మీద వడ్డించే కర్డ్ రైస్­ల వంటి పండుగలప్పుడు తయారు చేసేందుకు చక్కగా అనువైనది.

4.     గోంగూర & మామిడి ఆవకాయ ఊరగాయలు : ఆంధ్ర ప్రదేశ్ వంటిళ్ళలో నోరూరించే వివిధ రకాల వంటలు తయారవుతుంటాయి. మీరు పుల్లటి గోంగూర లేదా కమ్మని ఆవకాయ మ్యాంగో, ప్రియా వారి పికిల్స్ జతను రైస్, దాల్, లేదా పండుగ థాలీలతో ఎంచుకోవచ్చు.

5.     ఇదియప్పమ్ పిండి : మృదువైన, ఉడికించి తయారు చేసే స్ట్రింగ్ హాపర్స్­ను సునాయాసంగా తయారు చేయండి. ఈ డబుల్ హార్స్ ఇదియప్పమ్ ఫ్లోర్ మీ బ్రేక్­ఫాస్ట్ టేబుల్ వద్దకు నిముషాల్లో, కొబ్బరి పాలతో లేదా స్పైసీ కూరతో పండుగ విందుభోజనానికి చక్కగా అనువుగా ఉండే సాంప్రదాయాన్ని తెస్తుంది.

6.     పెసరపప్పు మరియు & మోత్ పప్పు : పండుగ రోజులకు సౌకర్యవంతమైన ఆహారం. ప్రోటీన్-ప్యాక్ చేసిన పప్పులను, ఖిచిడీ, దాల్ తడ్­కా, లేదా పండుగ పంచ్­మేల్ దాల్­ల కోసం ఉపయోగించండి. వాటిలోని వెచ్చదనం, వానాకాలంలో లేదా నవరాత్రి ఉపవాసపు ఆహారానికి స్టేపుల్­గా చక్కగా ఉపకరిస్తుంది.

7.     పంజాబీ లస్సీ : చల్లని, క్రీమీ, ఇంకా సెల్బ్రేటరీ! ఈ మదర్ డైరీ లస్సీ, మీరు చేసే పండుగ భోజనంతో పాటు తీసుకునేందుకు చక్కగా అనువైనది. దీని తియ్యని ఫ్లేవర్, చిక్కదనం, అందరినీ అలరిస్తుంది – ప్రత్యేకించి అమోఘమైన పరాఠాలు లేదా స్పైసీగా ఉండే ప్రధానాహారాలతో పాటు.

8.     గణేష్ పాపడ్ : మీ థాలీకి ఆ తుది క్రిస్పీ టచ్ జోడించండి. గణేష్ పాపడ్­లు, వెల్లుల్లి-ఫ్లేవర్­తో, వేయించటానికి లేదా రోస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉండే ఈ పాపడ్­లు బెంగాలీ, ఇంకా ఉత్తర భారతదేశపు పండుగ భోజనాలతో పాటు తప్పక ఉండి తీరవలసినవి. చట్నీతో పాటు తినటానికి లేదా దాల్-చావల్­తో పాటు తినేందుకు వడ్డించవచ్చు.

9.     మక్కీ ఆటా : సాధారణంగా చలికాలానికి కావలసినది అయిన జొన్న పిండిని వర్షాకాలంలో పండుగ సమయాల్లో కూడా ఎంతో ఇష్టపడుతుంటారు. రోటీలు, పకోడాలు, లేదా భజియాలను ఈ బంగారువన్నె కార్న్­మీల్­తో తయారు చేసుకుని, దానితో పాటు నెయ్యి లేదా స్పైసీగా ఉండే కూర రుచిని ఇనుమడింపచేస్తుంది.

10.   గఠియా : దీపావళి సమయంలో ఒక గుజరాతీ తప్పకుండా కలిగి ఉండవలసిన గఠియా మృదువుగా, చాలా తక్కువ స్పైస్ కలిగి ఉండి, నిరంతరం చిరుతిండిగా తింటూ పోగలగినది. మాత్రత్వ వారి ఈ ప్రీమియం వెర్షన్, ఉత్తమ నాణ్యత కలిగిన శనగపిండి మరియు సాంప్రదాయబద్ధమైన మసాలాలతో  తయారు చేయబడినది. బహూకరించేందుకు లేదా కుటుంబంలో బంధుమిత్రులు కలుసుకునేటప్పుడు వేడి టీతోపాటు సర్వ్ చేసేందుకు చక్కగా అనువైనది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad