Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా ముందంజలో ఉంది: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా ముందంజలో ఉంది: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : నిరుపేదలకు సొంత ఇళ్లను అందించే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లా లో వేగవంతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు. మొదటి విడత, రెండవ విడత  పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ పూర్తి అయినందున ఈ నెల లో రాష్ట్ర స్థాయి లో మన జిల్లా మొదటి స్థానం దక్కిన నేపథ్యంలో  ప్రభుత్వం నుండి  ప్రశాంస పత్రం, ల్యాప్ టాప్ ను పీడీ హోసింగ్ విజయసింగ్  ఇవ్వడం జరిగిందని  తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్   మాట్లాడుతూ మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేసి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో  ముందంజలో  ఉండటానికి    ప్రజాప్రతినిధులు,మండల స్పెషల్ అధికారులు, హోసింగ్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ ఎంపీవో, పంచాయతీ అధికారులు కృషి కృషి చేయడం జరిగిందన్నారు.క్షేత్ర స్థాయి లో  అధికారులు నిర్మాణాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ను ఎప్పటికప్పుడు సందర్శించి లబ్ధిదారులతో నిరంతర మాట్లాడుతూఇసుక, మొరం తదితర సామాగ్రి  నిర్ణీత ధరలకు అందేలా అధికారులు  పర్యవేక్షణ చేస్తున్నారన్నారని అన్నారు.. 

జిల్లా లో మొత్తం 9495 ఇల్లు మంజూరు కాగా  7730 గ్రౌండింగ్ దశ లో ఉన్నాయన్నారు. ఇందులో 4951 బెస్మెంట్ లెవల్ లో, గోడల దశలో 387, స్లాబ్ స్థాయి కి 134  దశ కి చేరుకున్నాయన్నారు.. ఇందుకు గాను  44 కోట్ల 94 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతా లోకి ప్రభుత్వం జమ చేసిందన్నారు. మిగతా ఇళ్ళు కూడా త్వరగా పూర్తి అయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనీ,ఇందుకు లబ్ధిదారులు కూడా సహకరించి జిల్లా కి మంచి పేరు రావడానికి అందరూ కృషి చేయాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad