బొంత రాము హీరోగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ రాము’. ఈ చిత్రంలో అజరు ఘోష్ విలన్‌గా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు మరో కీలక పాత్ర పోషించారు.
ఈ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మించారు. అజరు కౌండిన్య దర్శకత్వం వహించారు. త్వరలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
ప్రొడ్యూసర్, హీరో బొంత రాము మాట్లాడుతూ,’నాకు హీరోగా నటించాలని కల ఉండేది. దర్శకుడు అజరు కౌండిన్య నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కథ నచ్చింది. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ రోల్‌లో నటించాను. ఈ సినిమాతోపాటు నేను, డైరెక్టర్ అజరు కౌండిన్య మరో 9 చిత్రాలు చేయబోతున్నాం. మొత్తం మా కాంబినేషన్‌లో 10 సినిమాలు రాబోతున్నాయి’ అని చెప్పారు.
‘మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు కలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. మా ప్రొడ్యూసర్ రాము ఈ చిత్రంలో హీరోగానూ నటించారు. ‘పుష్ప’ సినిమా విలన్ అజరు ఘోష్ మా మీద అభిమానంతో ఇందులోనూ విలన్‌గా నటించారు. అలాగే జబర్దస్త్ అప్పారావు అడిగిన వెంటనే నటించేందుకు ఒప్పుకున్నారు. ఆస్పత్రిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ నేపథ్యంగా ఈ చిత్రం ఉంటుంది’ అని దర్శకుడు అజరు కౌండిన్య తెలిపారు.
ఘనంగా ‘మిస్టర్ రాము’ ఆడియో రిలీజ్ వేడుక
- Advertisement -
- Advertisement -