Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'అఖండ 2' విడుదల వాయిదా

‘అఖండ 2’ విడుదల వాయిదా

- Advertisement -

పలు కారణాల వల్ల ఇప్పటికే చాలా సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నారు. తాజాగా రవితేజ నటించిన ‘మాస్‌ జాతర’ సినిమా విడుదల వాయిదా పడింది.
అలాగే సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘అఖండ 2’ కూడా రావడం లేదు. ఈ సినిమా రిలీజ్‌ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే విషయంపై మేకర్స్‌ అధికారికంగా ఓ ప్రకటన చేశారు.
‘అఖండ 2’ అనేది కేవలం సినిమా కాదు. ఇదొక సినిమా పండగ. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ’ అఖండ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వస్తున్న ఈచిత్రం కూడా ఆ స్థాయిని మించి విజయం సాధించబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి అవసరమైన రీ-రికార్డింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్‌ వర్క్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం అని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ అధినేతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad