Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeసినిమాసంక్రాంతికి వస్తున్న'మన శంకరవరప్రసాద్‌ గారు'

సంక్రాంతికి వస్తున్న’మన శంకరవరప్రసాద్‌ గారు’

- Advertisement -

చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ ఆధ్వర్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌తో సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ‘పండగకి వస్తున్నారు’ అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వినాయక చవితి శుభ సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సాంప్రదాయంగా పట్టు చొక్కా, పట్టు పంచె, కండువా ధరించి, స్టైలిష్‌ షేడ్స్‌తో ఓ షిప్‌ డెక్క్‌ మీద గ్రాండ్‌ ట్రెడిషనల్‌ లుక్‌లో చిరంజీవి అలరించారు. కల్చరల్‌ టచ్‌, మెగాస్టార్‌ స్టైల్‌ రెండూ మిక్సై పోస్టర్‌ ఫ్యాన్స్‌కు ఫెస్టీవ్‌ ట్రీట్‌ అందించింది.
ఫ్యాన్స్‌ ఎలాగైతే చిరంజీవిని చూడాలనుకుంటారో అలాంటి అద్భుతైన క్యారెక్టర్‌లో మెగాస్టార్‌కి డైహార్డ్‌ ఫ్యాన్‌ అయిన దర్శకుడు అనిల్‌ రావిపూడి చూపిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – అనిల్‌ రావిపూడి, నిర్మాతలు – సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, సమర్పణ – అర్చన, సంగీతం – భీమ్స్‌ సిసిరోలియో, డీవోపీ – సమీర్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటర్‌ – తమ్మిరాజు, రచయితలు – ఎస్‌ కష్ణ, జి ఆది నారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – ఎస్‌.కష్ణ, లైన్‌ ప్రొడ్యూసర్‌ – నవీన్‌ గారపాటి, ఎడిషినల్‌ డైలాగ్స్‌ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad