- Advertisement -
- – బ్యాంక్ ఎదుట ప్రజాసంఘాల ఆందోళన…
నవతెలంగాణ-మల్హర్ రావు(మహముత్తారం) - తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్యాంక్ మహాముత్తారం శాఖ మేనేజర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలోని బ్యాంక్ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి,మేనేజర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు కొప్పుల చంద్రక్క అనే మహిళలకు తెలియకుండా ఆమె ఖాతాలోకి బ్యాంక్ మేనేజర్ డబ్బులు జమచేసి తిరిగి తన దగ్గరి వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు.ఇలా కొంత మంది ఖాతాల్లోకి మేనేజర్ డబ్బులు జమ చేసి తిరిగి అతడి స్వప్రయోజనాల కోసం ఆయన దగ్గరి వారి ఖాతాల్లోకి చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు.
- మోసపూరిత చర్యలకు పాల్పడుతున్న మేనేజర్ పై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని అధికారులను డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం సమ ర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ జిల్లా అధ్య క్షుడు పీక కిరణ్, అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షుడు రామగిరి రాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మందల రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్, అనిల్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, బాల జీ, గణేశ్, సమ్మయ్య పాల్గొన్నారు.
- Advertisement -