- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కర్ణాటక నుంచి 2,11,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో అధికారులు 27 గేట్లు ఎత్తి దిగువకు 2,11,098 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 317 మీటర్ల వద్ద ఉంది. ప్రాజెక్టులో 5.568 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు సమీప ప్రజలకు అధికారులు అప్రమత్తమంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
- Advertisement -