నవతెలంగాణ -హలియా :గణేష్ ఉత్సవాల సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. హాలియా మండలంలోని అనుముల గ్రామం కె.వి. కాలనీలో గణేష్ మండపంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. దండెం మణికంఠ (11) అనే బాలుడు మండపంలో విద్యుత్ వైరు తగలడంతో గట్టిగా షాక్‌కు గురయ్యాడు. క్షణాల్లోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హాలియా పోలీసులు విజ్ఞప్తి చేశారు. మండపాలలో విద్యుత్ పనులు తప్పనిసరిగా నిపుణులైన ఎలక్ట్రిషియన్ల ద్వారానే చేయించాలని, తెగిపోయిన లేదా బహిర్గతమైన వైర్లు వాడరాదని పిల్లలను విద్యుత్ పరికరాలకు దగ్గరగా అనుమతించకూడదు అని హలియా సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ అన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జాగ్రత్తగా భక్తితో నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. కాగా ఈ పది రోజుల వ్యవధిలోనే కరెంట్ షాక్‌తో 11 మంది మృతి చెందడం గమనార్హం.
గణేష్ మండపంలో అపశ్రుతి..బాలుడు మృతి
- Advertisement -
- Advertisement -