Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్లొంగన్ చెరువుకు ఎలాంటి ముప్పు లేదు

లొంగన్ చెరువుకు ఎలాంటి ముప్పు లేదు

- Advertisement -

– ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు తెలిపిన అధికారులు..
నవతెలంగాణ –  జుక్కల్ 

జుక్కల్ మండలంలోని లొంగన్ చెరువుకు ఎటువంటి ప్రమాదం ముప్ప లేదని అధికారులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో తెలిపారు. శుక్రవారం లొంగన్ గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో భారీ వర్షాలు నమోదు అయిందని అన్నారు. గత మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో చెరువులు, వాగులు , వంకలు,  కుంటలు , అలుగులు పారుతున్నాయని తెలిపారు. కౌలస్ నాలా ప్రాజెక్టు కూడా నిండుకుండల మారిందన్నారు. ఇప్పటికే భారీగా నీరు వచ్చి చేరడంతో గత రెండు రోజులుగా నీటినీ దిగకు వరద గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్టు  తెలిపారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజలకు గ్రామాలలో అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు వారికి సూచనలు చేస్తూ ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే మండలంలో పప్పు దినుసు పంటలు, పెసర కోతకు వచ్చిందని, ఈ వర్షానికి భారీ పంట నష్టం జరిగిందన్నారు. ఎమ్మెల్యే తో పాటు ఎంపీడీవో శ్రీనివాస్, తాహసిల్దార్ మారుతి, లొంగన్ జిపి కార్యదర్శి అనురాధ , గ్రామస్తులు సదు పటేల్ , విండో చైర్మన్ శివానంద్ పటేల్  , మాజీ జెడ్పిటిసి  సాయ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad