Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సాగర్ గావ్ లో వైద్య శిబిరం ఏర్పాటు

సాగర్ గావ్ లో వైద్య శిబిరం ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సావర్ గావ్ గ్రామంలో జుక్కల్ 30 పడకల ఆస్పత్రి మెడికల్ అధికారి వైద్యుడు విట్టల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సావర్ గావ్  గ్రామం వద్ద కౌలాస్ నాళా ప్రాజెక్టు ఉందని అన్నారు. ఇటీవలే గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీగా ప్రాజెక్టులోకి వచ్చి చేరిందని తెలిపారు.  నీటి విడుదల చేస్తున్న సందర్భంగా ప్రాజెక్టు దగ్గర్లో ఉన్న గ్రామాలైన సావర్ గావ్ , సావర్ గావ్ తాండా ప్రజలు సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ముందు జాగ్రత్తగా వైద్య క్యాంపు నిర్వహించడం జరిగిందని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు  తెలిపారు.

వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యంగా సమస్యలతో ఉన్నవారు  అదేవిధంగా సావర్ గావ్ గిరిజన తండా ప్రజలు కూడా వైద్య శిబిరానికి వచ్చారని అన్నారు. ఇప్పటికే 70 మంది వ్యక్తులు కాళ్లు నొప్పులు, వంటి నొప్పులు,  మైనర్ సమస్యలతో వైద్య శిబిరానికి వచ్చారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేయడం జరిగిందని అన్నారు. వారందరికీ ప్రభుత్వం అందజేసిన ఉచిత మందులను పంపిణీ చేశామని తెలిపారు. గ్రామస్తులు గ్రామాలలో పరిశుభ్రత పాటించాలని , భోజనం చేసే ముందు నిత్యం చేతులు శుభ్రంగా కడుకోవాలని , ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే సీజనల్ వ్యాధులు దరికి రావని అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ విట్టల్, ఏఎన్ఎం రేష్మ , ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad