నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఆల్ఫోర్స్ స్కూల్ పెరుమీద కొనసాగుతున్న నరేంద్ర లిటిల్ నేషనల్ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని మండల విద్యాశాఖ అధికారీ కార్యాలయంలో సిసిఓకి మెమొరాండం ఇచ్చినట్టు విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా లిటిల్ నేషనల్ స్కూల్ , నరేంద్ర స్కూల్ పేరుమీద ఆల్ఫార్స్ బ్రాండ్ పెరిమీద ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తూ స్కూల్ లో విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు అల్ఫార్స్ స్కూల్ అని లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని అన్నారు. విద్యార్థుల డాక్యుమెంట్స్ లో మాత్రం నరేంద్ర, లిటిల్ నేషనల్ స్కూల్ మీద మేమోలు, టీసిలు ఇస్తున్నారనీ ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకొని స్కూల్ గుర్తింపు రద్దు చేసి విద్యార్థులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో విద్యార్థి సేన నాయకులు అర్వీంద్, అంజి వికాస్ లు పాల్గొన్నారు.
పాఠశాల పర్మిషన్ రద్దు చేయాలి ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES