- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి జాతీయ రహదారి 44 పెర్కిట్ హైవే బ్రిడ్జిపై సిబ్బందితో కలిసి శుక్రవారం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లేవారు, మెట్పల్లి, కోరుట్ల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. కామారెడ్డిలో భారీ వర్షాలకు హైవే దెబ్బ తినడం వల్ల దారి మళ్లింపు జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించాలని సూచించారు.
- Advertisement -