నవతెలంగాణ – మద్నూర్
పేదల పాలిట దేవుడంటూ వరద బాదిత మహిళలంతా ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు అభినందనలు తెలిపారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వరద బాధ్యతుల పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు సందర్శించించారు. అనంతంర బాదితురాలైన మహిళ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. అయ్యా రెండు రోజులుగా ఇక్కడ ఉంటున్నాం. బట్టలు లేక ఇబ్బంది పడుతున్నామంటూ వేడుకుంది. మహిళ మాటలకు వెంటనే స్పందిస్తూ.. మహిళలు ఎంతమంది ఉన్నారో వారికి కావలసినన్ని చీరలు తీసుకురావాలని ఆదేశించారు.
వెంటనే కావలసిన చీరలు తీసుకువచ్చి మహిళలందరికీ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అడుగగానే కొత్త చీరలు అందజేసిన ఎమ్మెల్యేకు వరద బాదిత మహిళలంతా ఎమ్మెల్యేను అభినందిస్తూ .. పేదల పాలిట నీవు దేవుడవయ్యా అంటూ ఆశీర్వదించారు. పునరావాస కేంద్రంలో బాదితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించాలని మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ కు ఆదేశిస్తూ.. పార్టీ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలు ఎలాంటి చింత పడకూడదని, భారీ వరద నీటితో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వరద బాదిత మహిళలకు చీరలు అందజేసిన ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES