- Advertisement -
- త్వరగా రోడ్డు వేయాలని కోరుతున్న ప్రజలు
- నవతెలంగాణ – కామారెడ్డి
- బీబీపేట మండల కేంద్రానికి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బుధవారం బిబిపేట పెద్ద చెరువు అలుగు పారింది. దీంతో బీబీపేట -జనగామ మధ్యలో ఉన్న బ్రిడ్జి రోడ్డు వర్షానికి కొట్టుకపోయింది. ఈ క్రమంలో దోమకొండ, కామారెడ్డి, జనగామ తదితర గ్రామాల నుండి వెళ్లే వాహనాలు ఆ బ్రిడ్జి వరకు మాత్రమే వెళ్తున్నాయి. దీంతో గ్రామానికి ఇతర గ్రామాలకు లింకు తెగిపోయింది.
బీబీపేట పెద్ద చెరువుకు గండిపడడంతో ఆ చుట్టు పక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేట మండల కేంద్రం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు సైతం ఈ రోడ్డు గుండానే వెళ్లవలసి ఉండడంతో బీబీపేటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ రోడ్డును మరమ్మతు చేసి తిరిగి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం నిజాం కాలంలో జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద భారీ వర్షాలు పడలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. భారీ వరదలు రావడం, రోడ్లు తెగిపోవడం గత 50 సంవత్సరాలుగా ఎప్పుడు చూడలేదని పలువురు పేర్కొంటున్నారు.
- Advertisement -