అవినీతికి చెక్ పడేనా.?
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్ ) ఆధారంగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆసరా పింఛన్లలో అక్రమాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. కానీ ఆసరా పింఛన్లలోని అక్రమాలకు అడ్డుకట్ట పడేనా.?ని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబర్ నుంచే ఈ విధానంతో పింఛన్ల పంపిణీ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. మండలంలో మొత్తం 11,94 పింఛన్దారులు ఉండగా ఇందులో 1,525 వితంతువులు, 530 వికలాంగులు, 66 గీతకార్మికులు, చేనేత 8, ఒంటరి మహిలలు 26 ఉన్నారు. సింహ భాగం పింఛన్ల పంపిణీ ప్రయివేటు స్కాపింగ్ మిషన్ల ద్వారా పింఛన్లు పొందుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ తో రూపొందించిన 111 సెల్ఫోన్లతోపాటు బయోమెట్రిక్ మిషన్లు, స్కానర్లు మంజూరు చేస్తోంది. ఇవి పోస్టాపిస్ లో పింఛన్లు తీసుకునే వారికి మాత్రమే వర్తించనుంది. అంధులుంటే పంచాయతీ కార్యదర్శి సహాయంతో అందజేయనున్నారు.
ముఖ గుర్తింపుతో పింఛన్లు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES