నవతెలంగాణ – కంఠేశ్వర్
గత మూడు రోజులుగా జిల్లాలో భారీ నుంచి అతిబరి వర్షాలు కురిసిన నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం , తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు , పల్లపు వెంకటేశులు మాట్లాడుతూ… గత మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినై. కారణంగా వాగులు, వంకలు, ఒర్రెలు, ఉపనదులు, నదులు ఉప్పొంగి పారుతున్నాయి. అలాగే సింగూరు జలాశయంలోకి ఎగువ నుండి 90,000 క్యూసెక్కుల నీరు పైన వచ్చి చేరుతుండడంతో ముందు జాగ్రత్తగా నిజాంసాగర్ అధికారులు దిగువ మంజీరలోకి, అలాగే కాలువల్లోకి పూర్తిస్థాయిగా నీటి నీటిని వదలడం జరిగింది. ఫలితంగా మంజీరా నది పారివాహక ప్రాంత గ్రామాలు మొత్తం గుంపు గురై పంట పొలాలు దెబ్బతిన్నాయి.
నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట, లింగ తండా, ముత్తకుంట, కుర్నాపల్లి మధ్యలో గల నిజాంసాగర్ టు అలీ సాగర్ కెనాల్ నిండుగా ప్రవహించి కాల్వ పైనుండి కూడా పొరలి ఉగ్రరూపం దాల్చడంతో పక్కన ఉన్న పొలాలు వందలాది ఎకరాలు నీట మునిగి కుప్పకూలిపోయినాయి. అవి పంట పండవు. మురిగిపోతాయి. భవిష్యత్తులో అంటే..! రైతాంగం ఆరుగాలం కష్టపడి పంటని పొట్ట దశకు తీసుకొచ్చుకున్న తరుణంలో ఈ పరిస్థితి రావటం రైతు కంట కన్నీరు కారుతుంది తప్ప ఆనంద భాష్పాలు ఉండవు. అందుకోసం రైతు పెట్టుబడి పెట్టిన దానికి ఒకటిన్నర రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు, తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం అందించని దశలో రైతంగం పూర్తిస్థాయిగా నష్టపోతుందని అందుకు బాధ్యులు మీరే అవుతారని హితవు పిలికారు.
నష్టపరిహారం ఇవ్వకుంటే నష్టపోయిన రైతంగం మొత్తాన్ని కూడా గట్టి సమరశీల పోరాటాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే రాజు, సభ్యులు సుమన్, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.
ముంపుకు గురైన పొలాలను సందర్శించిన వ్యకాస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES