Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీఐటీయూ

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీఐటీయూ

- Advertisement -

ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలి 
భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి 
సీఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

స్థానిక సమస్యలను పరిష్కరించాలని కనీస వేతనాలు ఇవ్వాలి అని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలి అని, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని, అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడి ఆశ గ్రామపంచాయతీ బిల్డింగ్ వర్కర్స్ మున్సిపల్ మధ్యాహ్న భోజనం వివిధ రంగాలలో కార్మికులు పనిచేస్తున్నారు. కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం, పర్మినెంట్ చేయాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. సబ్బులు నూనెలు బూట్లు బ్యాటరీ సైకిల్ సెలువులు బీడీ కార్మికులకు కనీస వేతనాలు జీఎస్టీ ని రద్దు చేయాలని తెలిపారు.

26 రోజులు పని కల్పించాలని, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 ఇవ్వాలని పని భారం తగ్గించాలని, అధికారుల వేధింపులను ఆపాలని కోరారు. మధ్యాహ్నం భోజనం కార్మికులకు వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నిప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, హాస్టల్స్ లో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్ స్వీపర్ సెక్యూరిటీ తదితర కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని ముఖ్యంగా పెండింగ్ సాలరీస్ యూనిఫామ్ పిఎఫ్ ఈఎస్ఐ సెలవులు 104 ఉద్యోగుల ఐదు నెలల బకాయి వేతనాల సమస్యపై ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ లో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రాలు జిఓ నెంబర్ 60 ప్రకారం డిఈఓ క్యాడర్, శాలరీ కోసం ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలి.

కాంట్రాక్ట్ ఏఎన్ఎంల స్థానిక సమస్యలు పని భారం వేధింపులు బకాయి వేతనాలు ఇతర సమస్యలు నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న వివిధ రంగాలలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది కేంద్ర విపత్తుగా పరిగణించి రైతాంగానికి ఆదుకోవాలని ఎకరానికి రూ.50 వేల చొప్పున పంట నష్టం నష్టపరిహారం చెల్లించాలని జిల్లాలో ఇండ్లు నీటితో మునిగిపోవడం వల్ల వారికి తక్షణ సాయం కింద కింటల్ బియ్యాన్ని రూ.10 వేల నగదును వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలని కోరుతున్నాం. జిల్లాలో అధికారులు పర్యటనలు చేపట్టాలని వాటిని మరమ్మతులు చేయడం లాంటివి వేగవంతం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, మొహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad