నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
హతిరాం బాబా మఠం కూల్చివేత నిర్ణయం ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరమించుకోవాలని సామాజిక రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ్ లాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని తెలంగాణ రచయితల వేదిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాథిరాం బాబా వెంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడని, తిరుమల తిరుపతిలో వెలసిన వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తులలో ఆయన ఒకరని, ఆయన ఉత్తర భారత దేశనికి చెందిన వాడని తిరుమలలో ప్రత్యేకంగా ఆయన మఠం ఉందని దానిని ప్రభుత్వం కూల్చివేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని అన్నారు. బంజారా ప్రజల ఆరాధ్య గురువు హాతిరాంబాబా అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వేముల శేఖర్ పాల్గొన్నారు.
హాతిరాం బాబా మఠం కూల్చివేత విరమించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES