నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంచిన ముసాయిదా ఓటరు జాబితాను ఆయా పార్టీల నాయకులు శుక్రవారం సరి చూసుకున్నారు. ఓటర్ లిస్ట్ సవరణన, అభ్యంతరాలను ఈనెల 30 లోపు లిఖితపూర్వకంగా స్థానిక గ్రామపంచాయతీ అధికారులకు అందజేయాలని అధికారులు సూచించిన నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు గ్రామపంచాయతీ కార్యాలయాలకు వచ్చి ఓటర్ జాబితాను పరిశీలించారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తుల ఓట్లు ఉన్నాయా లేదా అని జాబితాలను పరిశీలించారు. ముసాయిదా ఓటర్ జాబితాను పరిశీలించేందుకు ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా గ్రామపంచాయతీ కార్యాలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి గ్రామపంచాయతీ సిబ్బంది ఓటరు జాబితాను అందించగా వార్డుల వారిగా తమ తమ ఓటర్ల వివరాలను ఆయా పార్టీల నాయకులు సరిచూసుకున్నారు.
ఓటరు జాబితాను సరిచూసుకున్న నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES