Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వరద ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి  పర్యటన 

వరద ప్రభావిత గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి  పర్యటన 

- Advertisement -

– దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జి, పాడైన పంటల పరిశీలన
– బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట దెబ్బతింది- ఎమ్మెల్యే
– నష్టపోయిన పంటలకు ఎకరాన రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
గత రెండు మూడు రోజులుగా నిజమాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు పాడయ్యాయని, వేల ఎకరాల పంట కూడా నష్టపోవడం జరిగిందని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు, పెద్దవాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. పైన నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలో పలు చెరువులు తెగటంతో కప్పల వాగు కు వరద ఉధృతి ఎక్కువగా వచ్చిందన్నారు. దీనివల్ల పెద్ద మొత్తంలో బాల్కొండ నియోజకవర్గంలో పంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రిలిమినరి లెక్కల ప్రకారం 1162 ఎకరాల్లో వరి, 95 ఎకరాల్లో మక్క, 35 ఎకరాల్లో సొయా పంట దెబ్బతిందని వ్యవసాయ అధికారులు తెలిపినట్లు చెప్పారు.

ఈ మేరకు శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని పలు వరద బాధిత మండలాల గ్రామాల్లో ఆయన పర్యటించారు.వరదకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జి, పాడైన పంటలను సంబంధిత అధికారులు, నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఏ గ్రామానికి వెళ్లిన రైతులు మా పంట నష్టపోయిందని అంటున్నారన్నారు. మరొక్కసారి పంట నష్టంపై క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలు తీసుకొని ప్రభుత్వానికి  నివేదించాలని వ్యవసాయ అధికారులకు సుచించారు. నష్టపోయిన వరి పంటకు,మొక్క జొన్న, సోయా పంటకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వేల్పూర్-రామన్న పేట దారిలో కల్వర్టు, రోడ్  దెబ్బతింది

వేల్పూర్-మోతె మధ్యలో ఉన్న రోడ్ కల్వర్టు పూర్తి గా శిథిలావస్థకు చేరిందని,గతంలో నూతన కల్వర్టు కొరకు నిధులు మంజూరు కాగా ఈ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.మళ్ళీ కల్వర్టు నిర్మాణానికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆర్మూర్- భీంగల్  మార్గంలో కప్పలవాగు పై ఉన్న హై లెవల్ బ్రిడ్జ్ వరద ఉధృతికి ఒక బిట్ గడర్ పక్కకు జరిగిందని, నష్ట అంచనాలు త్వరగా వేసి ప్రభుత్వానికి నివేదించాలని ఎస్ఈ కి సూచించారు. భీంగల్- బడా భీంగల్ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బ తినడంతో తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని, రోడ్డు పునరుద్ధరించడానికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఎమ్మెల్యే అన్నారు. కమ్మర్ పల్లి-ఉప్లూర్ రోడ్ కోతకు గురయ్యిందని, తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు.

పనులు త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేస్తా…

నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల రోడ్లు భవనాల శాఖ, మంచాయతి రాజ్, ఇరిగేషన్ శాఖలో జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి పంపినట్లైతే నేను కూడా సంబంధిత మంత్రులకు నష్టంపై నివేదించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా కృషి చేస్తానన్నారు.

మోతెలో దెబ్బతిన్న పంటను పరిశీలన 

కప్పల వాగు వరద ఉధృతికి మోతె గ్రామనికి చెందిన రైతులు నర్సారెడ్డి, మహేష్ మొక్కజొన్న పంట 5 ఎకరాల్లో పూర్తిగా తినడంతో వ్యవసాయ శాఖ  అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజాలెవరూ ప్రవాహల వద్దకు వెళ్ళకండి: స్వీయ నియంత్రణ పాటించండి – వేముల

ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని సమాచారం ఉందని, ప్రజలు ఎవరు కూడా వాగులు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లవద్దని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. వాగు పరుతుంది, చెరువు ఆలుగు వెళ్ళింది చూసి వద్దము అని ఆత్రుత వద్దని అన్నారు. చిన్న పిల్లలను, ప్రజలను కరెంట్ స్థంబాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరు ఎన్ని చెప్పిన ఇలాంటి సమయంలో ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.



- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad