నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం శుక్రవారం, గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల ఓటరు జాబితా గ్రామ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. 12 వార్డులలో పార్టీ బలోపేతం కోసం ఇన్చార్జిలను నియమించుకొని గ్రామ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కార్యకర్తలతో వార్డుల వారీగా అవగాహన సదస్సు కార్యక్రమాలు గ్రామంలో నివసిస్తూ 18 సంవత్సరాలు నిండి ఉండి ఓటు హక్కు లేనివారు ఎవరైనా ఓటు నమోదు చేసుకోగలరని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములకై ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న ఎన్నికలలో ఓటు హక్కు ఉపయోగించు కోవటం కోసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్వి మండల అధ్యక్షులు ఒగ్గు మల్లేష్ , మాజి వార్డ్ మెంబర్ కర్రే చంద్రశేఖర్, ఎండి ఇమామ్, ఓరిగంటి శ్రీధర్ ఆచారి, కర్రె కరుణాకర్, ఒగ్గు శేఖర్, రెబల్ యూత్ మెంబర్ కర్రె మధుపండు కర్రే లింగస్వామి, దుద్దురు హర్షవర్ధన్ గౌడ్, కర్రె చింటూ, శ్రీధర్ శ్రీనాథ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
జీపీ ఎన్నికల ఓటరు జాబితా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
- Advertisement -
- Advertisement -



