నవతెలంగాణ – భిక్కనూర్
ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. పట్టణ కేంద్రంలోని దాసినమ్మ కుంట ఇటీవల కురిసిన వర్షానికి తెగిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం కుంట తెగిపోయిన ప్రాంతాన్ని, ధ్వంసమైన సిద్ధ రామేశ్వర ఆలయం రహదారిని పరిశీలించారు. భారీ వర్షం కారణంగా శిథిలావస్థలో ప్రజలు నివసించకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇల్లు కూలిపోయిన వారికి వసతి, భోజనం ఏర్పాటు చేయలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, నాయకులు విజయ్, లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మహేష్ గౌడ్, తదితరులు ఉన్నారు.
ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES