నవతెలంగాణ డిచ్ పల్లి
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయిన ఇందల్ వాయి నుంచి ధర్పల్లి వెళ్లే రోడ్డుకు పోలీసులు తాత్కాలిక మరమ్మత్తులు చేయించారు. తిర్మన్ పల్లి గ్రామ శివారు దాటిన తర్వాత ఒక్కసారిగా వచ్చిన వరదల కారణంగా రెండు భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో గురువారం ఉదయం నుంచి ధర్పల్లి, భీమ్గల్, సిరికొండ తో పాటు ఆయా గ్రామాలు, మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనితో శుక్రవారం ఉదయం ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ జి సందీప్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామస్తుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాలను తొలగించారు. ప్రస్తుతం వాహనాలు వెళ్ళడానికి రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. దీంతో వానదారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.