నవతెలంగాణ డిచ్ పల్లి
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఇందల్ వాయి మండలంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను రైతులతో కలిసి శుక్రవారం మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ కుమార్ పరిశీలించారు.
మండలంలోని చంద్రయాన్ పల్లి, త్రియంబక్ పేట్, ఇందల్ వాయి గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా వరద దాటికి నష్టపోయిన పంటపొలాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడే పంట నష్ట అంచన వేయడం అంత సులువు కాదని అన్నారు. ప్రస్తుతం వరద ఎక్కువగా ఉన్న గ్రామాలను పరిశీలిస్తామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంట నష్టంపై వివరాలు సేకరిస్తామని చెప్పారు.

ఇప్పటికే సందర్శించిన చాలా చోట్ల పంట పొలాల్లో ఇసుక మెటాలు పేరుకుపోయి ఉనట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రకాష్ గౌడ్, ప్రశాంత్, రమాకాంత్ తో పాటు ఆయా గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.