నవతెలంగాణ- రాయపోల్
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కటలు నిండడంతో పంటలు కూడా నీట మునిగిపోయాయి. మునిగిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి వర్షాల వలన దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. వరద నీటితో కొన్ని ప్రాంతాలలో పంట పొలాలు నీట మునిగిపోయాయి. అలా నీటితో నిండిపోయిన పంట పొలాలను పరిశీలించి వాటిని రక్షించుకోవడానికి రైతులకు పలు సూచనలు చేశారు. వీలు ఉన్న చోట పంట పోలలా నుండి నీరు వెళ్ళే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకొంటే పంట నష్టం తగ్గించే అవకాశం ఉంటదన్నారు. అదే విధంగా వర్షాలు తగ్గిన తర్వాత నీటిలో మునిగిన పంటలకు 19.19.19 ఒక కేజీ మరియు ఫార్ములా- 4 ఒక కేజీ ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లు అయితే నీట మునిగినా పంటలు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు మన మండల పరిధిలో ప్రాథమికంగా వరి 183 ఎకరాలలో , ప్రత్తి 52 ఎకరాలలో దెబ్బతినట్లు ప్రాథమికంగా అంచనా వెయ్యటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES