Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతు ఆత్మహత్య కుటుంబంతో పుట్టిన రోజు వేడుకలు

రైతు ఆత్మహత్య కుటుంబంతో పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ -రాయపోల్ 
పుట్టిన రోజు వేడుకలు అనగానే ఎంతో అంగు ఆర్భాటాలు, మందు విందులు డీజే సప్పుడులతో హంగామా సృష్టించే నేటి రోజులలో కూడా పుట్టిన రోజు వేడుకలు అంటే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ వినూత్న ఆలోచనలతో మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఎక్సైజ్ ఎస్ఐ సలీం కుటుంబం. శుక్రవారం రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన కీర్తి స్వామి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబంతో కొడకండ్ల గ్రామానికి చెందిన ఎక్సైజ్ ఎస్ఐ సలీం కొడుకు అర్సాలన్ పుట్టిన రోజు వేడుకలు జరుపున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన రోజు వేడుకలు అనగానే ఈ రోజులలో ఎంతో రూపాయలు ఖర్చు పెడుతూ ఎంతో గొప్పగా వేడుకలు నిర్వహిస్తుంటారు. అలాంటి వేడుకల ద్వారా సమాజంలో తమ స్థాయిని తెలియజేసుకేనే వారు కూడా ఉన్నారు.అలా కాకుండా డబ్బులు వృధా చేసే బదులు నిరుపేదలకు ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచినట్లు ఉంటుందని ఆలోచనతో ఎల్కల్ గ్రామానికి చెందిన స్వామి గతంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబం రోడ్డున పడింది.

అలాంటి కుటుంబానికి అండగా నిలవాలని ఒక నెలకు సరిపోయే నిత్యవసర వస్తువులు, ఐదువేల రూపాయలు నగదుని తన కొడుకు చేతుల మీదుగా ఆ కుటుంబానీకి అందజేసి తన కొడుకు యొక్క పుట్టినరోజు జరపడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడం చాలా దురదృష్టకరమని అయినా సరే కుటుంబాన్ని నడిపించడం స్త్రీలకు కత్తి మీద సామే అయినప్పటికీ స్త్రీలు మొక్కువోని ధైర్యంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం, అప్పుల బాధ భరించడం, పిల్లలను చదివించుకోవడం చాలా గొప్ప విషయమని స్త్రీలు నిజంగా చాలా ధైర్యవంతులని పిల్లలను సాధ్యమైనంత వరకు బాగా చదివిపిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు రావాని ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ సలీం అన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పులిరాజు,నర్సింలు గౌడ్,రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad