Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలునక్ష ప్రకారం మర్రికుంట కాలువ తీయించండి: సీపీఐ(ఎం)

నక్ష ప్రకారం మర్రికుంట కాలువ తీయించండి: సీపీఐ(ఎం)

- Advertisement -

ఎమ్మెల్యేకు విన్నవించిన సీపీఐ(ఎం) పట్టణ కమిటీ
నవతెలంగాణ – వనపర్తి 

మర్రికుంటకు సంబంధించి నక్ష కాలువ ప్రకారంగా కాలువ తీసి రాజనగరం చెరువులోకి నీరు వెళ్లేలా చూడాలని సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ కార్యదర్శి పరమేశ్వర ఆచారి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మర్రికుంట అలుగు ను శుక్రవారం సందర్శించారు. అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర చారి మాట్లాడుతూ మర్రికుంట దగ్గర ఉండే చిన్న కుంట అలుగు మారడంతో వరద నీరు ఇళ్ల మధ్యలోకి చేరి అక్కడే నిలిచి ఇళ్లకు పోవడానికి చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. కాబట్టి కుంట నాలుగు పారే నక్ష ప్రకారం కాలువలు తవ్వించి కింది చెరువులోకి నీరును సాఫీగా పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం వనపర్తి ఎమ్మెల్యేకు ఈ కుంట కు సంబంధించిన నక్ష ప్రకారంగా కాలువ తీసి రాజనగరం చెరువులో నీరు వెళ్లే విధంగా చూడాలని వినతి పత్రం అందజేశారు. ఇక్కడ ప్రధానంగా నివసించే వారికి ఇళ్లకు వెళ్లడానికి దారి లేక దోమలుఎక్కువై కొందరు ఇల్లు విడిచి వేరే దగ్గరికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. వనపర్తి మున్సిపల్ వారు 100 రోజుల కార్యక్రమాన్ని చేస్తున్నారని, కానీ ఇక్కడ ఉండే వారి ఇబ్బందులు గుర్తించి ఇళ్ల మధ్యలో ఉండే పిచ్చి మొక్కలను తొలగించి దోమల బెడద లేకుండా చూడాలని, ఎమ్మెల్యే దీనిపైన స్పందించి పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, ఏ లక్ష్మి, టౌన్ కమిటీ సభ్యులు గంధం గట్టయ్య, జి బాలస్వామి, డి కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad