నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యాంగ రక్షణ కోసం తన అభ్యర్థిత్వానిన బలపరాలని లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలందరికీ లేఖరాయనున్నట్లు ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి, బలపరచాలని లేఖలో అభ్యర్థించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు ఉపరాష్ట్రపతిగా సేవ చేసేందుకు అవకాశం ఇస్తే.. రాజ్యాంగాన్ని పరిరక్షించి, భద్రత కల్పిస్తానని అన్నారు. రాజ్యాంగ రక్షణకోసం తనను బలపరచాలని స్పష్టం చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గురువారం ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్యమైన పార్టీలు శివసేన (యుబిటి), ఎన్‌సిపి (ఎస్‌పి)ల అధ్యక్షులు ఉద్ధవ్ థాకరే, శరద్‌పవార్‌లతో బి.సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు.