ఆగ్రహించిన గ్రామస్తులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో దళితవాడలో సమస్యలను చెప్పుకునేందుకు శుక్రవారం మంత్రి సీతక్కకు వినతిపత్రం ఇవ్వగా తిరస్కరించిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని పసర గ్రామం దళిత వాడలో సిసి రోడ్ల నిర్మాణం ఓపెనింగ్ కొరకు పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ సీతక్క రావడం జరిగింది. మంత్రి సీతక్కకు మా బాధలు చెప్పుకుందామని మేమందరం కలిసి వెళ్లడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, మేము గత 60 సంవత్సరాల నుండి ఇక్కడ కాలనీలో నివసిస్తున్నాము, మేము నిరుపేదలము మాకు ఎలాంటి భూమి లేదు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటదని సీతక్కకి ఓటు వేసి గెలిపించుకున్నాము. అయితే వినతి పత్రం తీసుకోండని కోరగా ఆ వినతి పత్రాన్ని తిరిగి మా ముఖంపై విసిరి వేయడం జరిగిందిని, మంత్రి సీతక్క మేము దళితులమని, మమ్మల్ని హీనంగా ఈసరించుకుంటూ అధికార అహంతో పట్టించుకోకుండా వెళ్ళిపోయిందన్నారు. ఈ విషయమై సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు అంబాల మురళి తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జెమిని కవిత స్వరూప మమత పుష్ప ఆత్కూరు సమ్మక్క భాగ్య నాగేల్లి లాలమ్మ సంతోష చెంచు రాజమ్మ చంద్రకళ సుధాకర్ మంజుల సమ్మక్క కల్పన బుజ్జి బాబు తదితరులు పాల్గొన్నారు.
వినతి పత్రం స్వీకరించని మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES