నవతెలంగాణ – గోవిందరావుపేట
తాడ్వాయి మండలంలోని కాటాపూర్ జిల్లా పరిషత్ ఉనత పాఠశాలలో శుక్రవారం ఎన్ డి ఆర్ ఎఫ్ (నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్) ఆధ్వర్యంలో విద్యార్థులకు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.
కాటాపర్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్ డి ఆర్ ఎఫ్ హైదరాబాద్ వారు విచ్చేసి పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వాటి నుండి ఎలా ఎదుర్కోవాలి వాటిని జయించడానికి మనము మన పక్క వారికి ఎలా సహాయపడాలి అనే విషయమై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
15 మంది సిబ్బంది వచ్చి వివిధ విపత్తుల వాటి నివారణ ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులకు మంచి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్ మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతో అవసరమని, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని తద్వారా ఆ గ్రామంలో వచ్చేటటువంటి విపత్తుల నుండి ఇలా కాపాడుకోవాలో తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సక్రనాయక్, అక్బర్ బాషా, జీవన్ లాల్, సమ్మయ్య ,సామ్సన్, వెంకట్ ,పాపారావు, రాజేష్ ,విజయ, శ్రీదేవి, జయపాల్ , మోహన్ ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
కాటాపూర్ లో విద్యార్థులకు విపత్తులపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES