నవతెలంగాణ – డిచ్ పల్లి
జాతీయ క్రీడా దినోత్సవం ను యూనివర్సిటీ లో ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్. బి. ఆర్. నేత జాతీయ క్రీడా దినోత్సవం ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు దేశ ప్రజలు, క్రీడాకారులు గర్వించదగిన రోజన్నారు.దేశం లో హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం ను జాతీయ క్రీడా దినోత్సవం గా జరపడం అంటే ఆయన విశిష్టమైన క్రీడా నైపుణ్యం గల వారన్నారు.ఆయన ఆడిన క్రీడనే జాతీయ క్రీడా గా జరపడం అంటే ధ్యానచంద్ ప్రతిభ గొప్పదన్నారు.
ధ్యానచంద్ ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించి దేశాన్నీ ప్రపంచ పటం లో గొప్పగా నిలబెట్టారని తెలిపారు. విద్యార్థులు ధ్యానచంద్ జీవిత చరిత్ర ను చదివి, ఆయన ఆడిన ఆటను చూసి గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాదవ్ నరేష్, మల్లికార్జున్, క్రీడాకారులు గౌస్, వెంకటేష్, బి. శివ, అమృత్ చారి, శివ తదితరులు పాల్గొన్నారు.