నీట మునిగిన తాండ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఇందల్ వాయి మండలంలోని సిద్ధం పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాంసాగర్ తాండకు కొద్ది దూరంలో ఉన్న చెరువు తెగిపోయింది. దీంతో వర్షపు నీరు తాండ మొత్తానికి రావడంతో తాండవాసులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాండలో ఉన్న స్లాబ్ చేసిన వాటిపైకి ఎక్కి తమ ప్రాణాలను రక్షించుకున్నామని, ఇలాంటి వర్షం తామెప్పుడు చూడలేదని వారన్నారు. ప్రస్తుతం ఆ చెరువులో చుక్కనీరు లేకుండా చేరువంత ఖాళీ అయిపోయిందని తాండవాసులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్ తాండవాసులకు కొండంత ధైర్యం ఇచ్చి మనోధైర్యం కోల్పోవద్దని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తారని వారికి ధైర్యం చెప్పారు.